WORLD FLAG COUNTER

Flag Counter

Thursday 28 January 2016

NEW TECHNOLOGY FOR DETECTING CANCER DISEASE


క్యాన్సర్‌ కణాల గుర్తింపు ఇక సులువు ...!

• కలం పరిమాణంలో మైక్రోస్కోపు సిద్ధం 

మెదడులోని కణతి కణాలను విస్పష్టంగా చూపించే చిన్న మైక్రోస్కోపును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పెన్ను పరిమాణంలో ఉండే ఈ సాధనం ద్వారా శస్త్రచికిత్స సమయంలో రోగి మెదడులో కణతి కణాలన్నీ విజయవంతంగా తొలగించిందీ లేనిది ఆపరేషన్‌ గదిలో చూసుకోవడానికి వైద్యుడికి వీలు కలుగుతుంది. ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన మిలింద్‌ రాజ్యాధ్యక్ష కూడా పాలుపంచుకున్నారు. కణతిని తొలగించే సమయంలో దాన్ని పూర్తిగా తొలగిస్తున్నదీ లేనిదీ తెలుసుకునే మెరుగైన విధానమేదీ ప్రస్తుతం శస్త్రచికిత్స నిపుణులకు లేదు. ఆపరేషన్‌కు ముందు మెదడుకు సంబంధించి తీసిన చిత్రాలు, స్వీయ స్పర్శ జ్ఞానం, దృష్టి జ్ఞానం సాయంతో వైద్యులు ఇలాంటి శస్త్రచికిత్సలు చేస్తుంటారు. అయితే శస్త్రచికిత్స సమయంలో కణస్థాయిలో జూమ్‌ చేసి వీక్షించడం వల్ల కణతికి, సాధారణ కణజాలానికి మధ్య తేడాను వైద్యుడు కచ్చితత్వంతో గుర్తించగలడు. దీనివల్ల రోగి పరిస్థితి మెరుగవుతుందని పరిశోధనకు నాయకత్వం వహించిన జోనాథన్‌ లియు తెలిపారు. ఈ దిశగా.. ప్రస్తుతమున్న మైక్రోస్కోపుల కన్నా నాణ్యమైన చిత్రాలను, వేగంగా అందించేలా చిన్న మైక్రోస్కోపును రూపొందించినట్లు చెప్పారు. ఇందులో ‘డ్యుయల్‌-యాక్సిస్‌ కాన్ఫోకల్‌ మైక్రోస్కోపీ’ అనే కొత్త పరిజ్ఞానాన్ని వాడారు. అస్పష్టంగా ఉన్న కణజాలంలోకి చూడటానికి ఇది వీలు కల్పిస్తుంది. కణజాల ఉపరితలం కింద అర మిల్లీమీటరు వరకూ కూడా ఇది వీక్షించగలదు.

No comments:

Post a Comment