WORLD FLAG COUNTER

Flag Counter

Sunday 24 January 2016

JAJI MALLE POETRY IN TELUGU


శ్రీమతి Sasikala Volety గారు వ్రాసిన అద్భుతమయిన ఆటవెలది 'జాజిమల్లె' పద్యాలు చదివాక నాకు గుర్తుకొచ్చిన గతంలో నేను వేసిన బొమ్మలు. శ్రీమతి శశికళ గారికి ధన్యవాదాలు.
ఆ.వె
1.జాజి మల్లె బ్రతుకు జాలి గొలుపు నాకు
నోచుకొన వెపుడును నోము ఫలము
సందె పొద్దు వేళ శృంగారమౌ కాని
పగటి విరులు తప్ప, ప్రభువు కరుదు.
2. ఆడ పిల్ల నెప్పుడా జాజితో బోల్చి,
పంది రదియె వేయ , బలిమి కూడు.
జాణ యైన తాను, జాడించి బ్రతుకును
బేల యయిన, జాజి పూల తీరె.
3. మిగుల సంతసమున మేలుహారము జేరి
మురిసి పోవుచు నవి సరసి జేరు
భాగ్యవశమున నవి భగవంతు చేరినన్
చరిత మగును బ్రతుకు సఫలమగును.
4. సన్నజాజి చూడ చక్కనమ్మను బ్రోలు
రాతిరందు తరలు, రమణి సిగకె
సున్నితంపు సొగసు చూడ మరులు గొల్పు,
కొన్ని ఘడియ లున్న కూర్చు తావి.
5. విరిసి విరయ కుండు విరజాజి పూతాను,
వెల్లి విరిసి పంచు విరివి తావి
భువిని కురిసి మురియు విరితారలను బోలి,
ఫక్కుమనుచు నవ్వు పడతి వోలె.
6. విశ్వమందు భూరి గుణగణాలెన్నియో,
సన్నజాజి విరికి సరికి బోల,
జాజి పూవు నిలుచు సౌందర్య , సుకుమార
కుసుమమై, సుగంధ కోమలి వలె!
7. ఆ,వె
సన్నజాజి కెపుడు , సంతసంబేయగు
విరియ జాజి కెపుడు ,విసుగు రాదు
పరిమళాలు నింపు పడతుల శిగలందు
విస్తు పోవు విరహ వేళలందు.


THANKS TO SRI PVR MURTHY GARU FOR HIS ARTICLE

No comments:

Post a Comment