chitika

WORLD FLAG COUNTER

Flag Counter

chitika

Wednesday, 16 December 2015

THE POWER OF ANIMALS COMPARES TO HUMANS


మనకు లేని శక్తిసామర్ధ్యాలు జంతువులో ఉన్నాయి. వాటి నుండి నేర్చుకోవలసినది, గ్రహించ వలసింది ఎన్నో ఉన్నాయి అంటున్నారు శాస్త్ర వేత్తలు. జంతువుల కదలికలు, గెంతులు, అడుగులు, పరుగులు ఇవన్నీ శాస్త్రవేత్తలకు పరి శోధనాంశాలుగా తయారయ్యాయి. మన శరీరం లో కండలలోకి చేరిన ఆక్సిజన్‌ ఆ తరువాత శక్తి గా మారుతుంది.ఆక్సిజన్‌ వినియోగాన్ని విశ్లేషిస్తే సామాన్యుడికి, క్రీడాకారుడికి మధ్య ఆక్సిజన్‌ వినియోగంలో అయిదారు శాతానికి మించి తేడా కన్పించదు. జంతువుల శక్తి కేవలం ఆక్సిజన్‌ వినియోగం మీద మాత్రమే ఆధారపడదు. అవయ వాల పొడవు పై కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పరుగులు పెట్టే మానవులకు లేని శక్తి గుర్రాలకు ఉంది. గుర్రం పరుగు తీసేటప్పుడు దాని కడుపులోని బల్ల సంకోచిస్తుంది. ఫలితంగా ఎర్రరక్తకణాల సంఖ్య అధికమయి దానికి మరింత శక్తిని సమకూరుస్తాయి. మనిషి ఇలా అధికంగా శక్తి పొందాలంటే శరీరంలోని ఎర్రరక్తకణాలను ఎక్కించుకోవాలి. కొంతమంది క్రీడాకారులు ఈ పనిచేస్తూఉంటారు. దీనినే బ్లడ్‌డోపింగ్‌ అంటారు. అయితే ఈ పని చట్టవిరుద్ధం.

మనిషి తన శక్తిని పెంచుకునేందుకు వీలు లేకుండా అడ్డంగానిలచేది 'ఊపిరితిత్తులు'. వ్యాయామం, శిక్షణలతో గుండె వైశాల్యం పెంచు కోగలం. తద్వారా శరీరంలోకి చేరే రక్తాన్ని పెంచు కోగలం. శరీరంలో రక్తంపెరిగే కొలది అది ఊపిరి తిత్తుల నుండి బోలెడంత ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. కొంచెం శ్రమిస్తే కండలకు రక్తాన్ని చేర్చే సూక్ష్మ రక్తనాళాలను కూడా పెంచుకోగలం. ఊపిరి తిత్తులను మనం ఏ విధంగాను పెంచు కోలేము. గుర్రం వేగంగా పరుగెత్తుతూ ముక్కును ముందుకు జాపి, కళ్ళను పొడుచుకుంటున్న రీతిలో ఉంటుం ది. గుర్రం మరీ వేగం పెంచి పరుగెత్తిందంటే దాని ఊపిరితిత్తుల్లో రక్తం కారి చచ్చిపోతుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు మానవ శరీర నిర్మాణంలోని గుండె, ఊపితిత్తుల పనితీరు జంతువుల వాటితో సరిపోల్చి పరిశోధనలు చేస్తున్నారు. ఇవిఫలిస్తే వీటికి సంబంధించిన వైద్య చికిత్సా రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మనుషుల కన్నా పక్షులు, జంతువులకు ఆలోచనాజ్ఞానం అమోఘంగా ఉంటుందని పరిశోధకులు అభిప్రా యపడుతున్నారు. మనిషి ఏ పనులు చేస్తే చింపాంజీ ఆ పనులు చేయగలదు. చిన్నపిల్లలకు మనం మాటలు, ప్రవర్తనా నేర్పినట్లే చింపాంజీ లకు నేర్పవచ్చు. 

డాల్ఫిన్స్‌కు శిక్షణనిచ్చి వాటి చేత అద్భుత విన్యాసాలు చేయించడం మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. శబ్దాల తేడాలు కనుగొనేం దుకు కోతులపై వివిధ రకాల పరిశోధనలు చేశారు. కెన్యాకు సంబంధించిన కోతులు మూడు రకాల శబ్దాలను పసిగట్టగలవు. అలాగే ఆ శబ్దా లతో హెచ్చరించగలవు. ఒక హెచ్చరిక శబ్దం పాములు వస్తున్నట్లు తెలుపుతుంది. ఇంకొకటి గద్దలు వస్తున్నట్లు మరొకటి చిరుతపులి వస్తున్నట్లు శబ్దాలతో తెలుపుతుంది. ఈ శబ్దాలు విన్న ఇతర కోతులు తమపై ఏ శత్రువు దాడి చేయబోతున్నది ముందుగా తెలుసుకుని స్వీయరక్షణకు చర్యలు చేపడతాయి. ఎన్నో జంతువులు ఈ విధంగా తమ గ్రహణ శక్తిని వాడుకుంటూ శత్రువుల బారిన పడకుండాతమనుతాము రక్షించుకుంటున్నాయి. కుక్కలకు శిక్షణ ఇవ్వడంవల్ల అవి మనకు ఎన్నో పనులు చేసిపెడతాయి. లైట్లు వెలిగించగలవు. ఆర్పివేయగలవు. ఫ్రిజ్‌ నుండి కావలసిన పదార్ధాలు తెచ్చిపెట్టగలవు. పిల్లుల మానసిక శక్తి కూడా గొప్పదే. అవి ఎంత దూరం వెళ్ళినా తమ స్థావరాలను గుర్తించుకోగలవు. వీటికి పరిసరాల గ్రహణ శక్తి ఎక్కువ వాసన ఆధారంగా గుర్తుపడ తాయి. భూకంపాలను సైతం గుర్తించగల్గుతాయి. జంతువులు మాట్లాడలేవుకాని కొన్ని భావాలు వ్యక్త పరుస్తాయి. ఆవులు, ఎద్దులు, ఏనుగులుకన్నీళ్ళు కారుస్తాయి. కుక్కలు తమ స్నేహభావాన్ని వ్యక్త పరచడానికి తోక ఆడిస్తాయి. జంతువులకు కలలు వస్తాయా? అనే విషయం చెప్పడంకష్టం. మనిషికి రాత్రిపూట రేపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ సమయంలో కలలువస్తాయి. చాలా క్షీరదాలు, పక్షులు కూడా రేపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ నిద్రావస్థను అనుభవి స్తాయి. కుక్కలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు గొణుగు తున్నట్లు, ఏడుస్తున్నట్లు, గుర్రుపెడుతున్నట్లు శబ్దాలు చేస్తాయి. పరి శోధకులు జంతువులపై జరిపిన పరిశోధనలలో వాటికి కలలు వస్తాయని నిర్ధారణ చేశారు. ఈ సందర్భంగా ఒక విషయం చెబుతున్నారు. చేపలు కళ్ళు మూసుకోకుండా నిద్రపోతాయి. కళ్ళు మూసుకోలేదు కాబట్టి నిద్ర పోవడం లేదనుకోకూడదు. అదే విధంగా జంతువు లు నిద్రలో కలలు వస్తే వాటిని వివరించే శక్తి లేదు కాబట్టి వాటికి కలలు రావనుకుంటే ఎలా? అంటున్నారు.

Related Posts Plugin for WordPress, Blogger...

chitika