WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 12 December 2015

HEART CARE WITH FRUITS - EAT FRUITS DAILY AND REDUCE THE CHANCE OF ATTACKING HEART ATTACK


ప్రస్తుత రోజులల్లో గుండె సంబంధిత వ్యాధులు అధికమైపోయాయి. చిన్న వయసులోనే గుండె జబ్బులు రావటం, గుండెపోటు కారణంగా మరణాలు సంభవించడం జరుగుతోంది. శరీరంలో గుండె ఒక ప్రధాన బాగం. ఇది ఒక పెద్ద కండరం కాగా, ఇరవై నాల్గు గంటలూ పనిచేస్తూనే వుంటుంది. శరీరంలోని వివిధ బాగాలకు రక్తప్రసరణ చేస్తుంది. గుండెకు సంబందించిన రక్తనాళాలలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా మంచి ఆహారాలు, తగిన వ్యాయామం సహకరిస్తాయి. సాధారణంగా నలభై ఏళ్ళ వయస్సు దాటిన ప్రతి ఒక్కరిలో గుండె పనితీరుకు సంబంధించిన ఆలోచన, ఆందోళన తప్పక ఉంటుంది. అందుకే 40 నుంచి 50 వరకు ఏటా ఒకసారి, 50 దాటాక ఏడాదికి రెండు సార్లు లిపిడ్ ప్రొఫైల్ రక్తపరీక్ష చేయించుకొని, వైద్యలు సలహా తీసుకుంటే మీ గుండె నిక్షేపంగా ఉంటుంది. పరీక్షల సంగతి పక్కన పెడితే, గుండె ఆరోగ్యానికి ఏ రకమైన ఆహారాలు, జీవన విధానం ఆచరించాలనేది పరిశీలించండి. ప్రతిరోజ కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయాలు తినండి. డైనింగ్ టేబుల్ పై ఉప్పు, కారం లేకుండా చూసుకోండి. తీనే సమయంలో అధనంగా ఉప్పు వేసుకునే అలవాటు మానండి. ఈ సీజన్‌లో యాపిల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యానికి యాపిల్ చాలా మంచిది. అందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఒక కప్పు యాపిల్ ముక్కల్లో 3.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. నారింజపండ్ల రసంలో బి9 విటమిన్ ఉంటుంది. ఇది గుండెజబ్బులకు దారితీసే హోమోసిస్టైన్‌ను తగ్గిస్తుంది. పచ్చిబఠానీల్లో బి2, బి6 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్లు రక్తనాళాలను పదిలంగా కాపాడతాయి. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండెజబ్బులు వచ్చిపడతాయి. ద్రాక్షపండ్లు గుండెజబ్బులను దూరంగా ఉంచుతాయి. ద్రాక్ష వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఫ్లావాన్స్, ఆంతోసైనిన్ వంటి ఎన్నో మంచి లక్షణాలు ద్రాక్షపండ్లలో ఉన్నాయి. ద్రాక్షను గోరువెచ్చని నీళ్లలో లేదా ఉప్పు నీటిలో క డిగి తీసుకోవడం వల్ల రసాయనాల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది. వేరుశనగపప్పులు గుండెకు ఎంతో మేలు చేస్తాయట. రోజూ కాసిని వేరుశనగ పప్పులు, బాదంపప్పు, వాల్‌నట్స్ తీసుకుంటే గుండె నిక్షేపంగా ఉంటుందంటున్నారు నిపుణులు. వీటితో పాటు బీన్స్ కూర తరచుగా తనడం వల్ల కూడా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చక్కర వ్యాది వున్న వారు డాక్టర్ సలహా తీసుకోండి

No comments:

Post a Comment