chitika

WORLD FLAG COUNTER

Flag Counter

chitika

Wednesday, 16 December 2015

AGE WISE HEALTH PROBLEMS - GROWING AGE HEALTH TIPS


ప్రపంచంలో అతి ఎక్కువకాలం బ్రతికినట్లు గిన్నీసుబుక్‌లో నమోదయిన మనిషి పేరు షిజిచియో లుజుమి. ఉత్తర జపాన్‌దీవుల్లో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించిన ఇతడు 120 సంవత్సరాల 237 రోజులు జీవించాడు. 1986లో ఇతడు నిమో నియా వ్యాధితో మరణించాడు. తాను అంతకాలం బ్రతకడానికి బుద్దభగవానుడు, సూర్యుడు కారణ మని అతడు అభిప్రాయపడ్డాడు. అయితే మానవ జాతి 120 సంవత్సరాలు వయసుకు ముందే మరణించడం జరుగుతోంది. నడివయసునుండి శరీరం శిథిలంకావడం మొదలవుతుంది. ఆడ, మగ, ఇద్దరిలోను ఈ వయసునుండి క్రీడా సామర్థ్యాలు తగ్గడం ఆడవారిలో మెనోపాజ్‌ ఎదుర వ్వడం జరుగుతూ ఉంటుంది. అరవై సంవత్సరాలు వయసు వచ్చేసరికి రోగాలు శరీరంమీద దండ యాత్రలు చేస్తూ ఉంటాయి. పౌష్టికాహారం తీసుకోక పోతే కండరాలు, ఎముకల పటిష్టత తగ్గుతుంది. వ్యాయామం చేయకపోయినా ఈ పరిస్థితి తప్పదు. మానసిక ఇబ్బందులు ఏ విధంగా ఎదురవుతాయో స్పష్టంగా వర్గీకరించి చెప్పలేము. అయితే చాలా మంది వ్యక్తులలో మానసిక చురుకుదనం, బలం ఎనభై సంవత్సరాల వయసు వచ్చినా జంకవు. చాలా కొద్దిమందిలో 'ఆల్జీమర్స్‌' వంటి వ్యాధులు కన్పిస్తూ ఉంటాయి.

20 ఏళ్ళ ప్రాయంలో...
ఖీ మనిషి శారీరకంగా మంచి ఉన్నత స్థితిలో ఉంటాడు. మంచి బలం ఉంటుంది. కండర బలం, గుండెబలం తారాస్థాయిలో ఉం టాయి. వ్యాయామంతో మనిషి మరింత సమర్థవంతంగా తయారవుతాడు.
ఖీ శరీరంలో ఇమ్యూనిటివ్యవస్థ అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తుంది. ఇక ఏ వయసులోను ఇటువంటి స్థితి ఇమ్యూనిటీ వ్యవస్థకు ఉండదు.
ఖీ మానసిక శక్తి గరిష్టస్థాయిలో ఉంటుంది. నైపుణ్యాలు అత్యద్భుతంగా ఉంటాయి.
ఖీ వినికిడి, దృష్టి ఎంతో సునిశితంగా, స్పష్టం గా ఉంటాయి.
ఖీ ఈ వయసులో కాన్సర్‌వంటి వ్యాధులు సోకవు.
40 ఏళ్ల వయసులో...
ఖీ మహిళల విషయంలో 48 సంవత్సరాలు వచ్చేసరికి సాధారణంగా మెనోపాజ్‌ అనుభవాలు ఎదురవుతాయి. కొంతమందికి ఇంకా ముందునుండి మొదలుకావచ్చు.
ఖీ ఎముకలు క్షీణించడం ఆరంభం అవుతుంది.
ఖీ ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరిం చగల శక్తి ఉన్నతంగా ఉంటుంది.
ఖీ మగవారిలో బట్టతలఏర్పడడం మొదలవుతుంది.
ఖీ ఆడ, మగవారిలో 5వేల మందిలో ఒకరికి రెక్టర్‌ కాన్సర్‌వచ్చే అవకాశం ఉంటుంది. 700 మంది ఆడవారిలో ఒకరికి బ్రెస్టు కాన్సర్‌ రావచ్చు.
60 ఏళ్లు దాటితే...
ఖీ పెద్ద మెదడులోని ధమనుల (రక్తనాణాలు) గోడల్లో కొవ్వు పేర్కొని రక్తస్వేచ్ఛా ప్రవాహా నికి ఆటంకం ఏర్పడి పక్షవాతం, గుండె పోటు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఖీ తలజుట్టు రంగు కోల్పోతూ తెల్లజుట్టు దర్శనం ఇస్తుంది.
ఖీ లైంగిక వాంఛ సాధారణంగా తగ్గిపోతుంది. కొంతమందికయితే ఉండదు.
ఖీ మనుషుల్లో వందలో ఒకరికి క్రమంగా గణిత సామర్థ్యం మానసికంగా తగ్గిపోవడం ఆరంభం అవుతుంది. లెక్కలువేసి డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడంలో అసమర్థత ఎదురవు తుంది.
ఖీ ప్రతి 600 మందిలో ఒకరికి రెక్టల్‌ కాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. మహిళల్లో ప్రతి 450మందిలో ఒకరికి బ్రెస్టుకాన్సర్‌రావచ్చు.
80 ఏళ్ల ముదిమి వయసులో...
ఖీ ఈ వయసులోగల పదిశాతం వృద్ధులకు పార్కిన్‌సన్స్‌ వ్యాధి లేదా ఆల్జీమర్స్‌ వస్తుంది.
ఖీ యిరవయిల్లోవున్న కండరబలంలో నాల్గో వంతు బలం కండరాలు కోల్పోతాయి. ఇంకా ఎక్కువవంతు కూడా నష్టం కల్గవచ్చు.
ఖీ సాధారణంగా కీళ్ల వ్యాధులు వచ్చే పరిస్థితి హెచ్చుగా ఉంటుంది.
ఖీ ఏదో ఒక మానసిక సామర్థ్యం తగ్గిపోయే అవకాశం 85 శాతం ఉంటుంది.
ఖీ 250మందిలో ఒకరికి రెక్టల్‌కాన్సర్‌ రావచ్చు. 300 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్టు కాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. 50 మందిలో ఒకరికి తుంటి ఫ్రాక్చర్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ప్రయోగాలు :
హ్యూమన్‌ గ్రోత్‌ హార్మోనును కొంతమంది వయోవృద్ధులకు వైద్యులు ప్రయోగాత్మకంగా ఇచ్చారు. సాధారణంగా వయో వృద్ధులలో ఈ హార్మోనుతక్కువగా ఉంటుంది. వీరంతా ఈ హార్మోను ప్రభావంవల్ల మామూలుకన్నా శక్తివంతులయ్యారు.
వీరి కండరశక్తి 10 శాతం పెరిగింది. కొవ్వు 14 శాతం, చర్మం 7 శాతం దళసరి అయ్యింది. నా జీవితంలో మళ్లీ ఇంతబలం వస్తుందనుకోలేదు అన్నాడు ఒక వృద్దుడు. ఈ మందు ముసలితనాన్ని తాత్కాలికంగా కొంత వాయిదా వేస్తుందని భావిస్తున్నారు. ముదిమి వయసులో చాలా వాక్సీన్లు పని చేయవు. వీరిలో డిహెచ్‌ఇఎ అనే సహజ సిద్ధమైన హార్మోను బాగా తగ్గిపోతుంది. దీని ప్రభావం వల్ల శరీర రోగనిరోధకశక్తి తగ్గి జబ్బులను ఎదుర్కొన గల శక్తి శరీరానికి తగ్గిపోతుంది. ఈ హార్మోను శరీరానికి అందిస్తే జీవితకాలం మరింత పెరుగు తుందా? అన్నీ ప్రయోగాల దశలో ఉన్నాయి..వేచి చూడాలి.

Related Posts Plugin for WordPress, Blogger...

chitika