WORLD FLAG COUNTER

Flag Counter

Monday 30 November 2015

VIBHUDHI MAHATYAM - IMPORTANCE OF VIBHUDHI IN+ HINDU PUJA


విభూది మహత్యం 

మనుజుల లిఖితములను నుదుట రాసి బ్రహ్మ మమ్ములను సృష్టించెను.
దాని ఆధారముగా విష్ణువు పోషణ నియమకముల చేసెను.
తర్వాతి భాగమంతయు లయ కారక క్రియలకు అనుగ్రహ మీతడే ఈశ్వరుడు .
మనుజులకు లలాట లిఖితత్వం బులకు , విభూదులను బూసి ,
పైన రాసిన రాతల పరివేష్టితంబులను పాప ఖర్మలను, విముక్తి చేయు ,
అభిషేక ప్రియుడు యీతడు ...
మూడు రూపములు కలవాడు ముక్కంటి ,
త్రికాలములకు , కాలముల విభేదములుగా కనిపించు వాడు ఇతడు ..
త్రిశూల ధారి ,త్రినేత్ర స్వరూపుడితడు
త్రిపుండ్రములనే ధరింప చేసి తన ఆలయమున దర్శన మిచ్చి ,
సర్వ పాపంబుల ప్రక్షాళన చేయు విశ్వేశ్వరుడు యీతడు...
ఖర్మలన్నింటిని అగ్ని తోడ శుద్ధి చేయగా మిగిలినది భస్మము..
ఆ భస్మ లేపనములే తాను బుచ్చి మారని వర్చస్సుని ..
సృష్టించిన వాడు లయకారుడు ఈతడే ...
వారి యొక్క పరివేష్టిత విభూదులే లోక సంరక్షణలే గంగ,పార్వతీ ప్రదాయుడై ,
అలరారు వారు శైవ క్షేత్రవాసులు ...
జలముల భస్మమును గల్పి తనని అభిషేకము చేసి అది మారు తీర్ధముగా బుచ్చినన్
వ్యాధి,అపమృత్యు దోషం,అరిషడ్వర్గం ,సర్వ ఇంద్రియ ప్రకోపములను ,
పరిమార్చగలిగిన శక్తి భస్మంబుదే..
మోక్ష యోగంబులకు విభూది ధారణ మహత్తర ..యోగంబే ...
నిరాడంబర సంబరములు ఇచ్చు విభూది తీర్థంబు ఇదే
ఆ మహేశ్వర తత్వమే ఇది........... ...శ్రీమాత్రే నమః....

No comments:

Post a Comment