WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 28 November 2015

SHIVA PUJA TRADITIONAL IMPORTANCE


శివలింగాన్ని ఆవుపాలతో, వెన్నతో పూజించిన వారు అశ్వమేధయాగం చేసినవారు పొందే ఫలితాన్ని పొందుతారు.
నెయ్యితో ప్రతిరోజు శివలింగాన్ని పూజించేవారు నిత్యాగ్నిహోత్రం చేసే బ్రాహ్మణుడు పొందే ఫలితాన్ని పొందుతారు.
కేవలం నీళ్ళతో స్నానం చేయించిన నరుడు కూడా పుణ్యం పొందుతాడు, ప్రియాన్నీ పొందుతాడు.
శివసన్నిధిలో నెయ్యితో కూడిన గుగ్గులు మిశ్రితమైన ధూపాన్ని వేసిన నరుడు గోసవయజ్ఞం చేసిన ఫలాన్ని పొందుతాడు.
కేవలం గుగ్గులు ధూపం మాత్రమే వేసినవాడు కూడా సువర్ణదానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
నానావిధ పుష్పాలతో శివలింగాన్ని పూజించినవాడు వేయి ఆవులు దానం చేసినవాడు పొందే ఫలం పొందుతాడు.
మరొక దేశానికి వెళ్ళి శివలింగాన్ని ఆరాధించినవాని కంటె ఇష్టమయినవారు నాకెవరూ ఉండరు.
ఈ విధంగా అనేక విధాలయిన ద్రవ్యాలతో శివలింగాన్ని పూజించిన నరుడు నాతో సమానుడవుతాడు. మరణానంతరం తిరిగి జన్మించడు. భక్తులు పూజలతో, నమస్కారాలో స్తోత్రాలలో ఫలహారాలతో, బద్ధకం వదలి నా శివలింగాన్ని నిత్యం పూజించాలి. మోదుగ, మారేడుదళాలు రాజ వృక్షపూలమాలలు, జిల్లేడుపూలు పవిత్రమయిన పూలు. ఇవి నాకు మిక్కిలి ప్రీతిని కలిగిస్తాయి.
పండుగాని, కూరగాని, పువ్వుగాని, చివరకు నీరయినా సరే, నామీద మనస్సు నింపి నా భక్తులు సమర్పిస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను సంతోషిస్తే భక్తుడు పొందలేని ఫలమేదీ ఉండదు. కనుకనే నా భక్తులు ఎల్లవేళలా నన్నే పూజిస్తూ ఉంటారు. నా భక్తుల పాపాలు నశిస్తాయి. నా భక్తులు ఎన్నడూ నశిమ్చరు. నా భక్తులు అన్ని లోకాల్లోనూ పూజింపబడతారు. వందయజ్ఞాలు చేసినవారే నన్నుగానీ, నా భక్తుల్ని గానీ ద్వేషించే మానవులందరూ ఘోరమైన నరకాన్ని పొందుతారు. అని లింగపూజ గురించి మహేశ్వరుడు పార్వతో పలికిన పలుకులు. (మహాభారతం - అనుశాసన పర్వం).

No comments:

Post a Comment