WORLD FLAG COUNTER

Flag Counter

Monday 30 November 2015

PANCHARAMALA PUTTUKA - STORY OF PANCHARAMA KSHETRALU


 పంచారామాల పుట్టుక

శ్రీ కాళహస్తి , శ్రీ శైలము , ద్రాక్షారామం , అనే మూడు శివలింగ క్షేత్రాల మధ్యన ఉన్న ప్రదేశంను "త్రిలింగ దేశమని" ఇక్కడ ప్రజలను త్రిలింగులని పిలిచెడివారు . క్రమంగా రూపాంతరం చెంది, తెలుంగుగాను, మరి కొంత కాలమునకు తెలుగువారు గాను మారారని మన పూర్వీకులు తెలియజేసినారు . త్రిలింగ దేశమున "పంచరామాలు" అనే ప్రసిద్ధమైనఐదు శివ క్షేత్రాలు ఉన్నాయి. అవి అమరారామము (అమరావతి), సోమారామము(భీమవరం), క్షీరారామము (పాలకొల్లు), ద్రాక్షారామము(తూర్పు గోదావరి జిల్లా) మరియు కుమారారామం(సామర్లకోట).

పంచ + ఆరామాలు = పంచారామాలు

ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధము. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కథనము.

శ్రీనాధుడు (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఒక కథ ఇలా ఉన్నది. క్షీరసాగర మధనం లో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు.

దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలొ త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్టించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ట చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్దికెక్కినవి.

స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తొంది.

హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొదుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ , పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.

" శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః "

‍ ‍ ‍ ‍ ‍ ‍ - స్కాందము

తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చొట్ల ప్రతిష్టించారు. అవే పంచారామ క్షేత్రాలు.

01. దక్షారామము (ద్రాక్షారామము, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
02. కుమారారామము (సామర్లకోట, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
03. క్షీరారామము (పాలకోల్లు, ప||గో|| జిల్లా) - రామలింగేశ్వరుడు
04. భీమారామము (భీమవరం, ప||గో|| జిల్లా) - సోమేశ్వరుడు
05. అమరారామము (అమరావతి, గుంటూరు జి||) - అమరేశ్వరుడు

ఇవన్నీ దేవతలు ప్రతిష్టించినవేనని స్థలపురాణం చెపుతొంది.

No comments:

Post a Comment