WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 28 November 2015

INFORMATION ABOUT HIMACHALA KSHETRAM TEMPLE AT MALLURU - WARANGAL


హేమాచల క్షేత్రం

తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం మనకి 'హేమాచల లక్ష్మీనరసింహస్వామి' క్షేత్రంలో కనిపిస్తుంది. వరంగల్‌ జిల్లా 'మల్లూరు' సమీపంలో గల ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనదిగా ... మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధిచెందిది. ఇక్కడి గిరిజనులు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి కొండకోనల్లో తిరుగాడుతూ ఈ ప్రదేశానికి చేరుకున్నాడట. లక్ష్మీదేవి అంశతో జన్మించిన 'చెంచులక్ష్మి' ని ఇక్కడ మకర సంక్రాంతి రోజున వివాహామాడాడని విశ్వసిస్తుంటారు. అందువలన ఈ రోజున ఇక్కడ గిరిజనులంతా కలిసి వరపూజా మహోత్సవాన్ని జరిపిస్తారు.

ఈ ఉత్సవంలో స్వామివారి పట్ల ... అమ్మవారి పట్ల ఇక్కడివారికి భక్తిశ్రద్ధలే కాదు అంతకుమించిన ప్రేమానురాగాలు కనిపిస్తుంటాయి. తమని కరుణిస్తున్నదీ ... కాపాడుతున్నది ఆ లక్ష్మీనరసింహుడేననే అపారమైన విశ్వాసం వారి మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగా సిద్ధులు ... యోగుల వంటి వారు కొన్ని ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకుని అక్కడ ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతుంటారు. అక్కడి ప్రజలకి వాళ్లపట్ల అపారమైన విశ్వాసం కలుగుతుంది. దాంతో వాళ్లని దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తూ వుంటారు. ఆ యోగులు సజీవసమాధి చెందిన తరువాత ఆ ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతుంటాయి.

ఆ పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ మనసులోని కోరికలు చెప్పుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో మొక్కులకు సంబంధించి ఒక్కోచోట ఒక్కో ఆచారం కనిపిస్తూ వుంటుంది. సాధారణంగా దైవ క్షేత్రాల్లో తమ మొక్కు చెల్లించమంటూ కొబ్బరికాయలు కట్టడం ... గంటలు కట్టడం వంటివి చేస్తుంటారు. ఇక ఈ తరహా క్షేత్రాల విషయానికి వచ్చే సరికి, మొక్కుకునేవారు ఆచరించే పద్ధతి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది.

No comments:

Post a Comment