WORLD FLAG COUNTER

Flag Counter

Friday 5 December 2014

PENUKONDA - KONDA PATA - SONG OF RAYALASEEMA LITERATURE OF SRI RALLAPALLI ANANTHA KRISHNA SARMA GARU


పెనుకొండ - కొండ పాట.!
(రాయలసీమ సాహిత్యములో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ - కొండ పాటను
రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశారు.). .

పెనుకొండ - కొండ పాట.
,
చనిన నాళుల - తెనుగు కత్తుల
సాన పెట్టిన బండ - ఈ
పెనుకొండ - కొండ
రంధ్రముల ప్రహరించు శత్రుల
రక్తధారల ద్రావి త్రేచిన
ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల
కఱితి నీలపు దండ - ఈ
పెనుకొండ - కొండ
వెఱవు లెఱుగని - బిరుదు నడకల
విజయనగరపు రాజు కొడుకులు
పొరలబోయగ కరుడు గట్టిన
పచ్చి నెత్తురు కండ - ఈ
పెనుకొండ - కొండ
తిరుమలేంద్రుని - కీర్తి తేనెలు
బెరసి దాచిన కాపుకవనపు
నిరుపమ ద్రాక్షారసంబులు
నిండి తొలకెడి కుండ - ఈ
పెనుకొండ - కొండ

No comments:

Post a Comment