WORLD FLAG COUNTER

Flag Counter

Monday 15 September 2014

WITHOUT MANGO LEAVES - THERE IS NO TRADITIONAL OCCASION WILL BE PERFORMED IN INDIA - WHY



మామిడాకులు లేకుండా ఏ శుభకార్యం జరగదు.. ఎందుకని?

ప్రేమకు, సంపదకు, సంతానాభివృద్ధికి ప్రతీక మామిడి. జీవితంలో ముఖ్యమైన ఈ మూడింటినీ అందించే మొక్కగా మామిడిని పూజిస్తారు రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతో పాటు అనేక ఇతర పురాణాలలో మామిడిమొక్కల ప్రస్తావన ఉంది. మామిడాకుల పాత్ర లేకుండా ఏ శుభకార్యం జరగదు. మంగళతోరణాలు కట్టేందుకు వాడేది మామిడి ఆకులనే. పూజకు ముందుంచే పూర్ణకుంభంలో అమర్చేది మామిడి ఆకులనే.

పూర్ణకుంభమంటే భూదేవిరూపం. అందులో పోసే నీరు మనజీవితానికి మూలాధారమైనవి. ఆ కుంభంలో ఉంచే కొబ్బరికాయ, అమర్చే మామిడి ఆకులు జీవితాన్ని సూచిస్తాయి. ఆ పూర్ణకుంభం అమరిక లక్ష్మీదేవి రూపమవుతుంది. మామిడి తోరణాలు శుభకార్యాలకు కడతారు. భగవంతుని పూజించేందుకు మామిడిని వాడతారు. భారతీయ సాహిత్యంలో మామిడిని స్తుతించిన విధంగా మరొకచెట్టును స్తుతించలేదు. దీనిని కల్పవృక్షమన్నారు. మామిడి పువ్వును మన్మథుని బాణాలలో ఒకటిగా కాళిదాసాది కవులు వర్ణించారు. క్రీ.పూ. 150 కాలం నాటి సాంచీ స్థూపంమీద మామిడిచెట్టు, పండ్లు అద్భుతంగా చెక్కడం కనిపిస్తుంది. శిల్పకళతో పాటు అనేక ఇతర హస్తకళల్లో మామిడిరూపం కనిపిస్తుంది.

No comments:

Post a Comment