WORLD FLAG COUNTER

Flag Counter

Thursday 25 September 2014

WHAT ARE THE ESSENTIALS REQUIRED FOR PERFORMING DASARA PUJA



పూజకు అవసరమైన ముఖ్య వస్తువులు

01. పూజ వేళ ఉపయోగించుటకుగాను విడివిడిగ పాత్రలలో జలము, ఉద్ధరిణెలు లేదా చెంచాలు కావలేను.

02. ఏ దైవమును పూజించుచున్నామో ఆ దైవము యొక్క చిత్రపటము లేదా ప్రతిమ, అది కూడా లేనప్పుడు బంగారు లేదా వెండితో చెసిన కాసు.

03. ముఖ్యముగా “వినాయక” పుజకు “వరలక్ష్మీ పూజకు పాలవెల్లి కట్టి తీరవలెను.

04. దీపారధనకు కుందులు, ప్రత్తితో చేసిన వత్తులు, ఆవు నెయ్యి, అవి వెలిగించుటకు ఒక అగ్గిపెట్టె, ధూపారాధనకు సాంబ్రాణి.

05. పూజ నిమిత్తము అక్షతలు, పువ్వులు, పసుపు కుంకుమ.

06. ఇతరేతరోపచారార్ధము =- తపలపాకులు, వక్కలు, అగరు వత్తులు, గంధము, హారతికర్పూరము, కొబ్బరికాయలు.

07. ప్రధానముగా కలశము, దానిపైకి ఒక కొబ్బరికాయ, రవికెల గుడ్ద.

08. వినాయకపూజకు తప్పనిసరిగా 21 రకముల పత్రి కావలెను.

09. నివేదన (నైవేద్యం) నిమిత్తముగా బెల్లము ముక్క (గుడశకలం), అరటిపళ్ళు (కదళీఫలం), కొబ్బరి (నారికేళఫలం) ఇవి సాధారణావసరములు.

No comments:

Post a Comment