WORLD FLAG COUNTER

Flag Counter

Sunday 27 July 2014

VITAMIN-D PUTS CHECK TO BREAST CANCER - ANALYSIS


ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఐదులక్షల మందికి పైగా మహిళలు రొమ్ముక్యాన్సర్‌ కారణంగా మరణిస్తున్నారు. గ్లోబకాన్‌ డాటా (క్యాన్సర్‌కు సంబంధించి అంతర్జాతీయ పరిశోధన ఏజెన్సీ) ప్రకారం రొమ్ము క్యాన్సర్‌ కారణంగానే 1.85 మిలియన్‌ సంవత్సరాల ఆరోగ్యకరమైన జీవితం నష్టపోతూ భారతదేశం ఈ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఉన్న 1,45,000 సరికొత్త రొమ్ముక్యాన్సర్‌ కేసులు మరో దశాబ్ధంన్నర నాటికి 2,14,000కు చేరుకునే అవకాశం ఉందని క్యాన్సర్‌ వైద్యుల అంచనా. ఇటీవల కాలంలో వెలువడిన పరిశోధనల ఫలితాల ప్రకారం విటమిన్‌ డి లోపం రొమ్ము క్యాన్సర్‌ వృద్ధికి ప్రధాన కారణంగా తేలింది. బ్రెస్ట్‌ టిషఉ్యలో విటమిన్‌ డి గ్రాహకాలు ఉంటాయి. విటమిన్‌ డి ని ఈ గ్రాహకాలు బంధిస్తాయి. దీనివల్ల క్యాన్సర్‌ జీన్స్‌ మరణించేలా చేయటం లేదా వృద్ధి చెందటం ఆపటం చేస్తాయి. దానితో పాటు క్యాన్సర్‌ సెల్స్‌ శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించకుండా కూడా అడ్డుకుంటాయి. విటమిన్‌ డి రొమ్ము క్యాన్సర్‌ను అడ్డుకోవటంలో సహాయపడుతుందని యుఎస్‌ఎకు చెందిన విటమిన్‌ డి, ఆరోగ్యం, సూర్యకాంతి శరీరానికి తగలటం అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ''విటమిన్‌ డి కౌన్సిల్‌'' తన అధ్యయనం ద్వారా తెలిపింది. దాని ప్రకారం ఇప్పటికే రొమ్ముక్యాన్సర్‌ కలిగిన మహిళలు లేదంటే గతంలో రొమ్ము క్యాన్సర్‌ కనుగొనబడిన మహిళలకు విటమిన్‌ డి ఎంతగానో సహాయపడుతుంది. రొమ్ము క్యాన్సర్‌ రోగుల్లో విటమిన్‌ డి ప్రమాణాలతో కూడిన నివేదికలు పరిశీలించిన తరువాత ఈ శక్తివంతమైన ప్రో హార్మోన్‌ ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. చాలా పరిశోధనలను సమీక్షించిన తరువాత రొమ్ముక్యాన్సర్‌తో బాధపడే మహిళలు ఎవరికైతే తక్కువ పరిమాణంలో విటమిన్‌ డి నిలువలు ఉంటాయో వారికి క్యాన్సర్‌ మరలా వచ్చే అవకాశాలు రెట్టింపుగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు. విటమిన్‌ డి అధికరగా ఉన్న వారితో పోలిస్తే మరణాల సంఖ్య కూడా విటమిన్‌ డి తక్కువగా ఉన్నవారిలో కనిపిస్తుందని విటమిన్‌ డి కౌన్సిల్‌ వెల్లడించింది.


No comments:

Post a Comment