WORLD FLAG COUNTER

Flag Counter

Friday 18 July 2014

USES OF FRUITS AND ITS COVERS - HEALTH TIPS WITH FRUITS WASTE



తొక్కలతో ఉపయోగాలెన్నో 

నిమ్మరసం కానీ, బత్తాయిరసం కానీ తీసిన తర్వాత తొక్కని పారేస్తున్నారా...! అయితే, ఇక నుంచీ ఆ తొక్కలు పారేయకండి. ఎందుకంటే సిట్రస్‌ జాతి పండ్ల తొక్కలను ఇంట్లో అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. వీటి వల్ల డబ్బులు ఆదా కావడంతో పాటు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

- గోరు వెచ్చని నీటిలో ఎండ బెట్టిన నిమ్మకాయ తొక్కను వేసి స్నానం చేయండి. ఇది మీ శరీరాన్ని, వెంట్రుకలనూ తాజాగా ఉంచుతుంది.

- నిమ్మ, కమలా, బత్తాయి వంటి సిట్రస్‌ జాతికి చెందిన పండు ఏదైనా సరే తొక్కను తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసి దాన్నిండా నీటిని పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. ఫ్రిజ్‌లోని చెడు వాసనలు పోయి, మంచి వాసనతో నిండిపోతుంది.
- సిట్రస్‌ జాతి పండ్ల తొక్కులకు కొద్దిగా బ్రౌన్‌షుగర్‌ను అద్ది అరచేతులకు, మోచేతులకు రుద్దితే మొరటుదనం పోయి కోమలంగా మారతాయి.

- ఎండిపోయిన సిట్రస్‌ పండ్ల తొక్కలను అండర్‌గార్మెంట్స్‌ ఉన్న సొరుగులో ఉంచితే, బట్టలు మంచి సువాసన వస్తాయి. డ్రాయర్ల లోపల ఒక సాచెట్‌ను పెడితే మంచి సెంటు వాసనను వెదజల్లుతుంది. తొక్కలను వార్డురోబ్‌లో ఉంచడం వల్ల సువాసనలు వెదజల్లుతాయి.

- నిమ్మ, నారింజ తొక్కలు నానబెట్టిన నీటితో నోరు పుక్కిలిస్తే నోటి దుర్వాసన ఉండదు. ఈ తొక్కలను నమిలితే దంతాలకు, చిగుర్లకూ ఎంతో మంచిది.

No comments:

Post a Comment