WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 15 March 2014

TELUGU ARTICLE ON HOLI FESTIVAL AND ITS IMPORTANCE



హోలి పండుగ

మనిషి అందం శరీరవర్ణంలో కాదు, మనసులో ఉంటుంది, అతని గుణగణాలలో, చేసే కర్మ(పని)లో ఉంటుంది. అది చెప్పడానికే అన్ని వర్ణాలకు అతీతమైన పరమాత్మ, ఏ రూపమూ, ఏ రంగు లేని పరమాత్మ, కృష్ణ(నల్లని)వర్ణంలో శ్రీ కృష్ణుడిగా అవతరించాడు.

ఒకసారి చిన్ని కృష్ణుడు యశోదమ్మ దగ్గరకు వచ్చి " అమ్మా! చూడమ్మా! రాధ తెల్లగా, అందంగా ఉంది. నల్లగా ఉన్నానని నన్ను ఆటపట్టిస్తోంది" అంటాడు. ఆ విషయం మన చూసుకుందాం అన్న యశోద, రాధ మీద రంగులు చల్లమని సలహా ఇస్తుంది.

అల్లరి కృష్ణుడు రాధతో పాటు బృందావనంలో ఉన్న గోపికల మీద కూడా రంగులు చల్లుతాడు. ఎన్ని రంగులు చల్లినా రాధ మాత్రం పున్నమి చంద్రుని వలె వెలిగిపోతుంటుంది. అలా శ్రీ కృష్ణపరమాత్మ రాధతో జరిపిన లీల హోలీ.

నిజానికి రాధ అంటే ఒక పాత్ర/వ్యక్తి కాదు. మహాభారతంలో రాధ ప్రస్తావన ఎక్కాడ కనిపించదు. రాధ అంటే ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాల మీద పట్టు సాధించినవారని/జయించినవారని అర్దం. ఆత్మ తత్వం అర్దమైనవారు ఇంద్రియాలను జయిస్తారు. అలాంటి వారు పరమాత్మకు చాలా దగ్గరగా జీవిస్తారు. అలా పరమాత్మకు దగ్గరైనవారి మీద ఆయనకు అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. అటువంటి వారితో(రాధ) పరమాత్ముడు ఆడే దివ్య లీల హోలీ.


No comments:

Post a Comment