WORLD FLAG COUNTER

Flag Counter

Friday 7 March 2014

ARTICLE ON THE IMPORTANCE OF SRI PANCHAMI / VASANTHA PANCHAMI - SRI SARASWATHI PUJA IN TELUGU



శ్రీ పంచమి./ వసంత పంచమి విశేషాలు.!

మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి / వసంత పంచమి అంటారు. ప్రతి ఒక్కరు ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తల స్నానం ఆచరించి, నిత్య నైమిత్తిక కర్మలు పూర్తీ చేసుకొని ' జ్ఞ్యాన ప్రదాత అయిన ఆ సరస్వతిని ' పూజించాలి. సరస్వతి దేవి ఈ రోజునే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ రోజున బ్రహ్మాది దేవతలు కూడా ఆ భారతిని కొలుస్తారు.
సరస్వతి దేవి కృప వలెనే జ్ఞ్యాన విజ్ఞ్యానాలు వృద్ధి చెందుతాయి. లౌకికమైన చదువులతోపాటు, పరమమైన బ్రహ్మ విద్య కూడా ఈ జగజ్జనని ప్రసాదిస్తుంది.
సరస్వతి దేవి విగ్రహం లేని వారు ఆ దేవి చిత్రమును కాని, పుస్తక రూపంలో గాని అర్చించాలి. చాలా మంది సరస్వతిని పిల్లలు, విద్యార్థులు మాత్రమె అర్చించాలి అనుకుంటారు. ఆబాల గోపాలమంతా ఆ శారదాంబను అర్చించవచ్చు జ్ఞ్యాన వికాసం అందరికీ అవసరమే .
ముఖ్యంగా జ్యోతిష్కులు ఆరాధిస్తే ఆ వాగీశ్వరి కటాక్షంతో వాక్శుద్ధి లభిస్తుంది.
ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి, తెల్లని వస్త్రాలను ధరించాలి, గృహానికి మామిడి తోరణాలు అలంకరించి, అమ్మవారిని షోడశ ఉపచారాలతొ పూజించి క్షీరాన్నం నివేదించాలి.ఎక్కువగా తెల్లని పూలు వాడాలి.

జోతిసశాస్త్ర పరంగా ఈ రోజున ( ఈ సారి మంగళవారం రావడం చేత పనికిరాదు ) అక్షరాభ్యాసాలు ముహూర్తాలకు చాలా మంచిది.
!! సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం !!

ప్రథమం భారతినమ ద్వితీయం చ సరస్వతి !
తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహని ||
పంచమం జగతీ స్థాథ షష్ఠం వాగీశ్వరి తథ !
కుమరీం సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిని ||
నవమం బుద్ధిధాత్రి చ దశమం వరదాయిని !
ఏకాదశం క్షుద్రగమ్తా ద్వాదశం భువనేశ్వరి ||
బ్రాహ్మి ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పథెన్నరహ్ |
సర్వసిద్ధికారి తస్య ప్రసన్న పరమేశ్వరి |
సామే వస్తూ జిహ్వాగ్రే బ్రహ్మరుప సరస్వతి ||

No comments:

Post a Comment