WORLD FLAG COUNTER

Flag Counter

Friday 31 January 2014

HOW TO STOP EXCESSIVE SWEATING - SIMPLE TIPS FOR OVERCOMING SWEATING ALL THE TIME



భరించలేని చెమట వాసన... అధిక చెమటతో చిరాకు..


కొంతమంది అలా మన ప్రక్కకు వస్తే వారి వద్ద నుంచి వచ్చే చెమట వాసనను భరించలేనంతగా ఉంటుంది. వారి వద్ద నుంచి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తుంటాం. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే చెమట దుర్గంధాన్ని పారదోలవచ్చు.ప్రతి వారంలో ఒక్కరోజు నువ్వుల నూనెను ఒంటికి బాగా రాసుకుని చింతపండు గానుగ గింజలను నూరి ఆ ముద్దతో ఒంటికి నలుగుపెట్టుకుంటే చర్మం నుండి వచ్చే దుర్వాసన పూర్తిగా తగ్గిపోతుంది.కొందరిలో అధిక చెమట పడుతుంది. అలాంటివారు వేపాకు, తామరపువ్వులు, దానిమ్మ చెక్క తీసుకుని నీళ్లతో నూరి ఆ ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుంటే అధికంగా వచ్చే చెమట శాతం తగ్గుతుంది.

No comments:

Post a Comment