WORLD FLAG COUNTER

Flag Counter

Saturday 4 January 2014

BHAGAVAD GITA SLOKAS AND ITS MEANING



హరిః ఓం 
గీత ..1వ అధ్యాయము ...21,22 శ్లోకాలు 
అర్జున ఉవాచ ...సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే౭చ్యుత 
యావతేదాన్నిరీక్షే ౭హం యోద్దుకామానవస్థితాన్ 
కైర్మయా సహ యోద్దవ్యం అస్మిన్ రణసముద్యమే.....అర్జునుడు చెప్పాడు :ఓ అచ్యుతా!యుద్దానికి తయారవుతున్న ఈ సమయంలో నా రథాన్ని రెండు సేనల మధ్య నిలుపమని కోరుతున్నాను .యుద్దం చేయడానికి సిద్ధపడి ఎవరెవరు
యుద్ద రంగంలో నిలబడ్డారో,వారిలో నేను ఎవరెవరితో యుద్దం చెయ్యబోతున్నానో
చూడాలనుకుంటున్నాను .
శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు ....అర్జునా !ఇది ని జీవితంలో ఒక గొప్ప మలుపు.ఇక నీవు అన్నీచోట్లా ,అన్నింటిలోనూ దైవికమైన ప్రయోజనాన్ని
చూడగలుగుతావు .అపవిత్రమైనది ఏదీవుండదు .అసహ్యకరమైనది ఏదీ వుండదు
ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే నువ్వు బలహీనుడివైతే నీకు బాధలు కలుగుతాయి
నువ్వు భయపడితే ,అన్నీ నిన్ను భయపెడతాయి .పరుగెత్తి పారిపోవడానికి
ప్రయత్నిస్తే ఎల్లకాలం ఒకచోటు నుండి ఇంకొకచోటుకి పరుగులు తీస్తూనే వుంటావు .ఎదుర్కో !అన్నింటిని ,శక్తితో ,ధైర్యంతో ,పట్టుదలతో ఎదిరించు.ఈ
జీవిత సమరం నుండి ,సమస్యలనుండి పారిపోవడానికి ప్రయత్నించినా మనం వాటిని తప్పించుకోలేము .నిజంగా జీవితమంటే అదే .వాటిని ఎదుర్కుని పరిష్కరించడమే సుఖం .......జీవితపు మేలిమలుపులోనీరసపడిజాలి ,దయల
పేర్లుచెప్పి అందరూ నా వాళ్ళు అనే మోహంతోయుద్దంనుండి తప్పించుకోచూసిన అర్జునిడిని కర్తవ్యబోధ చేసి జీవితంతో తలపడమని ఉద్బోదించాడు .........
ఓం పరమాత్మనే నమః

No comments:

Post a Comment