WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 18 December 2013

WHAT ARE THE NECESSARY FOOD PRECAUTIONS TO BE TAKEN FOR BABIES HEALTH GROWTH - BABIES HEALTH CARE TIPS




ఎక్కువ శాతం పిల్లలు 6 నెలలవరకు తల్లిపాలమీద ఆధారపడిఉంటారు. అయితే 6 నెలల తర్వాత నుండి తల్లిపాలు వీరికి సరిపోవు. తర్వాత వీరి పెరుగుదలకు అవసరమైన కాలరీలు, ప్రోటీన్ల ఆవశ్యకత పెరుగుతుంది. అందువల్ల 6 నెలల తర్వాత నుండి పిల్లలకు తల్లిపాలతో పాటు, పోతపాలు ఇతర ఆహారపదార్దాలను ద్రవరూపం లోగాని, ఘనరూపంలోగాని అలవాటు చేసే పద్దతిని వీనింగ్‌ అని అంటారు.
పాలలో విటమిన్‌ 'సి' తక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్‌ 'సి'ని అందివ్వ డానికి పిల్లలకు 6 నెలల నుండి పండ్లరసా లను అందివ్వాలి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఐరన్‌నిల్వలు లివర్‌లో ఉంటాయి. ఇవి పుట్టినప్పటి నుండి 4-6 నెలల వరకూ సరిపోతాయి. తర్వాత నుండి ఆహారం ద్వారా ఐరన్‌ వారికి లభించాలి. పాలలో విటమిన్‌ 'డి' కూడా తక్కువగా లభిస్తుంది. పిల్లలు అనుకున్న రీతిలో ఆరోగ్యంగా పెరగాలి అంటే సప్లిమెంటరీ ఫీడింగ్‌ 6నెలల నుండి మొదలుపెట్టాలి. లేకుంటే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆరు నెలల తర్వాత నుండి తల్లిపాలు 3 లేక 4 సార్లు మాత్రమే ఇస్తూ ఆవుపాలుకాని, గేదెపాలుకాని అలవాటు చేయాలి. ఈ పోతపాలలో పోషకాలు తల్లిపాలతో పోలిస్తే వేరుగా ఉండటం చేత, పిల్లలు అలవాటు పడటానికి పాలలో కాచి చలార్చిన నీళ్ళను, పంచదారతో కలిపి తాగించాలి. పాలు, నీళ్ళ శాతం 2+1 గా ఉండాలి. చక్కెరవలన కాలరీలు పెరుగుతాయి. ఆరంజ్‌, టమాటో, ద్రాక్ష వంటి పండ్లు మంచి పోషకాలు కలిగిఉంటాయి. వీటిలో లభ్యమయ్యే పోషకాలు పాలలో దొరకవు. అందుచేత ఈ పండ్ల రసాలను పిల్లలకు కాచి చల్లార్చిననీళ్ళు కలిపి ఇవ్వడం చేయవచ్చు. నీరు, జ్యూస్‌ 1+1గా ఉండాలి. జ్యూస్‌ను వడకట్టి తాగించాలి. క్రమంగా జ్యూస్‌ మోతాదు ను పెంచుతూ, నీటిశాతం తగ్గించాలి.
పండ్లు దొరకని పరిస్థితుల్లో ప్రత్యా మ్నాయంగా ఆకుకూరల రసాన్ని సూప్‌ గా చేసి ఇవ్వాలి. దీనిని వడకట్టి తాగిం చాలి. తర్వాత మెల్లగా వడకట్ట కుండా అలవాటు చేయాలి. వీటితోపాటు ఫిష్‌లివర్‌, ఆయిల్‌ కొన్ని చుక్కలు నుండి అరటేబుల్‌ స్పూన్‌ కొన్ని పాలలోకలిపి ఇవ్వడం వలన విటమిన్‌ ఎ, విటమిన్‌ డి లభ్యమవుతుంది. పిల్లలకు పట్టేముందు జ్యూస్‌లను బాగా కలపాలి. జ్యూస్‌, సూపులు నుండి మెత్తని ఆహారాన్ని 7 లేదా 8వ నెలలో మొదలుపెట్టవచ్చు. పెరుగు తున్న కాలరీస్‌, ప్రొటీన్ల ఆవశ్యకతల వల్ల వాటిని సరైన రీతిలో అందించడా నికి, బాగా ఉడికించి, మెత్తగా చేసిన తృణధాన్యాలను పాలు, చక్కెర కలిపి పెట్టాలి. క్యాలరీస్‌ ఎక్కువగా లభ్యమయ్యే మాల్టెడ్‌వీట్‌, రాగిని ఈ ఆహారంలో చేర్చాలి. మాల్టెట్‌ తృణధాన్యాలు అంటే వాటిని రాత్రంతా నానబెట్టి, ఒక గుడ్డలో మూటకట్టి, మొలకలు వచ్చిన తర్వాత ఎండలో ఎండబెట్టి, ఎర్రగా వేయించు కోవాలి. తర్వాత మొలకలు తీసేసి పౌడర్‌ చేసుకోవాలి. ఎక్కువగా ఆలుగడ్డ, ఆకుకూరలు, క్యారెట్స్‌ను ఇవ్వవచ్చు. ఈ కూరగాయల వల్ల విటమిన్స్‌, ఖనిజాలు లభ్యమవుతాయి. అలాగే ఈ ఆహార పదార్ధాల వల్ల పిల్లలు కలర్‌ ఫుడ్‌కి అల వాటు పడతారు.
బాగా ఉడికించిన పప్పులు, తృణధాన్యాలతో కలిపి తినిపించవచ్చు. ఉదా: కిచిడి, పొంగలి, పెసరపాయసం వంటివి. వీటిని పలుచగా కానీ లేదా కొద్దిగా సెమీసాలిడ్‌గా కానీ పెట్టవచ్చు. పప్పుధాన్యాలు ఇచ్చిన రోజు గుడ్డు, మాంసం ఇవ్వవలసిన అవసరం లేదు. అవి మరొక రోజు ఇస్తే పిల్లలకు కావలసిన శక్తి లభిస్తుంది. పిల్లలు చేతితో తీసుకుని కొరికి తినే సమయం అంటే 10-12 నెలల సమయంలో ఇలాంటి ఆహారం అందించాలి. బాగా ఉడికించిన తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, మాంసం పండ్లు పెట్టాలి. ఇడ్లీ, ఉప్మా, బ్రెడ్‌, చపాతి, అన్నం, పప్పు వంటివి అలవాటు చేయాలి. చిన్నగా తరిగిన పండ్లు, కూరగాయలలో గింజలు ఉంటే అవి తీసేసి ఇవ్వాలి. వీటివల్ల దవడలకు మంచి ఎక్సర్‌సైజ్‌ లభిస్తుంది. ఎందుకంటే పిల్లలు నమిలితింటారు. కాబట్టి ఎక్కువగా శ్రద్ధచూపించే తల్లి, ఎక్కువగా ఇంట్లోచేసిన వీనింగ్‌ఫుడ్స్‌నే ఇవ్వాలి. వీటిని తృణధాన్యాలు, పంచదార, బెల్లం, పాలతో ఇంట్లోనే తయారు చేసుకోవాలి.
ఉడికించిన గుడ్డు పచ్చసొన కొంచెం తినిపించాలి. దానివల్ల ఎలర్జీ ఉండదు. పిల్లలు తినగలుగుతున్నారని నిర్ధారిం చుకున్న తర్వాత క్రమంగా మోతాదు పెంచుతూ మొత్తం పచ్చసొన తినిపించ వచ్చు. గుడ్డులోని యోక్‌లో విటమిన్‌, ఐరన్‌, ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమవు తాయి. గుడ్డు తెల్లసొన మాత్రం సంవత్స రం తర్వాతనే పెట్టాలి. ఎందుకంటే దీనివల్ల పిల్లలకు అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.
అందరూ తినే ఆహారం సంవత్సరం దాటిన తర్వాత చిన్న చిన్న మోతాదుల్లో పాలలో కలిపి అలవాటు చేయాలి. గొంతులో ఇరుక్కునే అవకాశం ఉన్న పప్పుదినుసులు, ఎండుద్రాక్ష, పచ్చియాపిల్‌, కూరగాయలు, పాప్‌కార్న్‌ వంటివి దూరంగా ఉంచాలి. ఎందుకంటే గొంతులో ఇరుక్కుని వీటివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బంది వస్తుంది.

No comments:

Post a Comment