WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday 11 December 2013

ARTILCE ON HUMAN PART - NOSE AND ITS PROBLEMS - BRIEF DISCUSSION





''శరీర మాద్యం ఖలుధర్మ సాధనమ్‌''
''లోకమందు ఏ కార్యసాధనమునకైనను ముందుగా కావలసింది ఆరోగ్యం'' అన్నాడు మహాకవి కాళిదాసు తన కుమార సంభవంలో.
''ఆరోగ్యమే మహాభాగ్యం''అన్నది నానుడి. మంచి ఆరోగ్యం ఉంటే మనిషికి అన్నీ ఉన్నట్లే అంటారు కూడా! అంటే-మంచి ఆరోగ్యవంతుడైన మనిషి మంచి ఆలోచనలు చేస్తూ, మంచి మార్గంలో ప్రయాణిస్తూ కష్టపడి పనిచేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్‌ను తన సొంతం చేసుకుంటాడు.
సామాన్య ఆరోగ్యవంతుడు కూడా తన జీవిత కాలంలో కనీసం మూడుసంవత్సరాల పాటు వ్యాధులతో బాధపడతాడని చెప్పవచ్చు. మనిషికి ప్రాణవాయువును అందిస్తూ మనిషిలోని మిగిలిన అన్ని అవయవాలకు, జవాన్నీ జీవాన్నీ అందించే అత్యద్భుత అవయవాల్లో అతిముఖ్యమైనవి ముక్కు నోరే! ఎందు కంటే-ఒక మనిషి మంచి ఆరోగ్యంతో ఉండాలన్నా లేక అనారోగ్యాల బారిన పడాలన్నా ముక్కు'నోరే ప్రధాన భూమిక పోషిస్తాయి! అందుకే-మనిషికి వచ్చే జబ్బుల్లో కనీసం, 70%పైగా జబ్బులు ముక్కు' నోరు విషయంలో అలసత్వం, అశ్రద్ధ, అజాగ్రత్తల కారణంగానే వస్తుంటాయని వైద్యశాస్త్రం గుర్తించింది. మనం పీల్చేగాలి, మనం తీసుకునే ఆహారమే మనల్ని ముందుకు నడిపిస్తాయి. వీటి విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా తద్వారా మిగిలిన అవయవాలకు జబ్బులు సోకే ప్రమాదం ఉంటుందని అనుక్షణం గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం.
మనిషికి వచ్చేజబ్బులు సాధారణంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. ఇవి పుట్టుకతో వచ్చే జబ్బులు. వయసుతోబాటు వచ్చే జబ్బులు. అజాగ్రత్తలు లేదా ఇన్ఫెక్షన్స్‌ ప్రమాదాల కారణంగా వచ్చే జబ్బులు.
ఇక్కడే మనం ఓ ముఖ్య విషయం ప్రస్తావించు కోవాలి. ప్రతిమనిషికీ తనలోనే వ్యాధి నిరోధక శక్తి నిబిడీ కృతమై
ఉంటుంది.
మంచి ఆరోగ్యం ఉన్న మనిషికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఎక్కువ వ్యాధులు వస్తాయని మనం గుర్తించాలి. ముఖ్యంగా-ముక్కు -గొంతు ఇబ్బందులుఉన్నవారిలో వైరస్‌, బాక్టీరియా క్రిములు త్వరితగతిన చొచ్చుకుపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి! మనిషికి ప్రాణవాయువును అందిస్తూ అతను జీవించడానికి కారణమైన ప్రధాన అవయవమైన ముక్కుకు సంబంధించిన వ్యాధులు పలురకాలుగా ఉంటాయి. అవి ఏమిటంటే-
1. ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం
2. మెదడునుంచి కణితులు ముక్కుద్వారా బయటపడటం
3. ముక్కు చీలిక
4. ముక్కులో ఈగలార్వా అభివృద్ధి చెందటం
5. ముక్కులో వెంట్రుకలు-జిగురులాంటి పదార్థం తయారుకావడం
6.ముక్కునుంచి రక్తం కారడం
7. ముక్కులో కండరాలు పెరగడం
8. ముక్కులో కణితులు పెరగటం
9.సైనొసైటిస్‌
10. ముక్కు అలర్జీ మరియు వేసోమోటార్‌ రైనైటిస్‌.
11. ముక్కులో గడ్డలు
12. ముక్కుపైన గడ్డలు
13. ముక్కు క్యాన్సర్‌
14. నేనో ఫెరెంజియల్‌ ఏంజియో ఫైరోమా
15.చిన్న పిల్లల్లో ముక్కు వెనుక భాగాన లింఫ్‌ గ్రంథులు వాచడం వల్ల వచ్చే అడినాయిడ్స్‌.
16. ముక్కునుండి దుర్వాసన.
17. ముక్కులో పుండు.
18. ఒక ముక్కునుంచే రసికారడం.
19. ముక్కు నుంచి రక్తం, చీము కారడం.
20. బలపం, బఠానీలు, రబ్బరు, పెన్సిల్‌, స్పాంజి వంటివి ముక్కులో ఇరుక్కోవడం
21. ముక్కులో పేపరు, పుల్లలు ఉండిపోవడం
22. ముక్కులో రాళ్ళు తయారుకావడం
23. వాసన తెలియక పోవడం, గ్రహణ శక్తి తగ్గిపోవడం
24. ముక్కుతో మాట్లాడటం
25. మూసుకు పోయిన ముక్కు, గాలి పీల్చే నోరు.
26. ముక్కు కారడం (ఇది మెదడులో నీరేనేమో?)
27. కంట్లోనీరు-ముక్కులో జబ్బు
28. సైనస్‌ తలనొప్పి

29. ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల వచ్చే తలనొప్పి.
ముక్కు గురక
30. గురుక నోటి గురక
శ్వాసనాళం మూసుకుపోవడం వల్ల వచ్చే గురక.
31. ముక్కుకు వచ్చే ఇన్ఫెక్షన్స్‌
1.సాధారణ జలుబు
2. ముక్కుపైన పుళ్ళు పడటం.
3. దీర్ఘకాలికంగా ఉండే ముక్కువ్యాధులు
4. పొక్కులు కట్టే ముక్కు వ్యాధి (అట్రోఫిక్‌ రైనైటిస్‌)
32. ముక్కు ఎముక విరుగుట
33. వంకర ముక్కు.
34. ముక్కులో రక్తం గడ్డ.
(రక్తం గడ్డ చీము గడ్డగా మారడం)

No comments:

Post a Comment